

నటి మౌనీ రాయ్ వ్యక్తిగత జీవితంపై సోషల్ మీడియాలో గత కొద్ది రోజులుగా విడాకుల రూమర్స్ వైరల్ అవుతున్నాయి. ఆమె భర్త సూరజ్ నంబియార్ తో విడిపోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. తాజాగా ఈ వార్తలకు మరింత బలం చేకూర్చేలా ఇద్దరూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకున్నారు. అంతేకాకుండా మౌనీ రాయ్ ఇటీవలి కాలంలో భర్తతో ఉన్న ఫోటోలను షేర్ చేయకపోవడం, సూరజ్ ఇన్‌స్టాలో పెళ్లి ఫోటోలు కనిపించకపోవడం చర్చనీయాంశమైంది.
ఇప్పటివరకు ఈ రూమర్స్‌పై మౌనీ రాయ్ లేదా సూరజ్ నంబియార్ స్పందించకపోవడంతో అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. 2022 జనవరిలో గోవాలో వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే, విశ్వంభర సినిమాలో చిరంజీవి తో కలిసి మౌనీ రాయ్ ఓ స్పెషల్ సాంగ్‌లో కనిపించనున్నట్లు సమాచారం. ‘ఖైదీ’ చిత్రంలోని ‘రగులుతోంది మొగలిపొద’ పాట రీమేక్‌లో ఆమె నటించనున్నట్లు టాక్ వినిపిస్తోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!