

టాలీవుడ్ హీరో శర్వానంద్, దర్శకుడు శ్రీను వైట్ల కలయికలో తెరకెక్కుతున్న కొత్త సినిమా ఇండస్ట్రీలో ఆసక్తిని పెంచుతోంది. ‘జార్జ్ క్రిష్’ అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ చిత్రంపై రోజురోజుకీ చర్చ పెరుగుతోంది. ముఖ్యంగా హీరోయిన్ ఎంపిక విషయంలో అనేక వార్తలు వినిపిస్తున్నాయి. మొదట మమితా బైజు పేరు వినిపించగా.. ఇప్పుడు మాజీ మిస్ ఇండియా మానస వారణాసి పేరు ప్రధానంగా ప్రచారంలోకి వచ్చింది.
ఈ చిత్రంలో మానస వారణాసిని తీసుకునే దిశగా చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా మారుతుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. మరోవైపు పాత్ర కోసం శర్వానంద్ తన లుక్‌లో భారీ మార్పులు చేస్తున్నాడని టాక్ వినిపిస్తోంది. బైకర్ స్టైల్ పాత్ర కోసం ముందుగా బరువు తగ్గిన ఆయన, ఇప్పుడు పాత్ర అవసరాలకు అనుగుణంగా మళ్లీ వెయిట్ పెంచుకునేందుకు ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నారని సమాచారం.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!