
ఓటీటీ

జైలర్ 2 సినిమా విడుదల వాయిదా పడే అవకాశాలు ఉన్నాయనే వార్తలు సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 4కు మార్చే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే చిత్రీకరించిన కొన్ని సన్నివేశాలు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో వాటిపై మళ్లీ పని చేస్తున్నట్లు సమాచారం. ప్రేక్షకులకు మరింత మెరుగైన అనుభూతి ఇవ్వాలనే ఉద్దేశంతో ఎడిటింగ్‌పై కూడా ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.
ఇంకా దాదాపు నెల రోజుల షూటింగ్ మిగిలి ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి. అతిథి పాత్రల వ్యవహారంతో షెడ్యూల్స్, కథలో కొన్ని మార్పులు జరిగాయని టాక్ వినిపిస్తోంది. అయినప్పటికీ ఈ సినిమాపై అభిమానుల్లో భారీ ఆసక్తి కొనసాగుతోంది. సూపర్ స్టార్ రజనీకాంత్ మరోసారి మాస్ యాక్షన్‌లో కనిపించనున్న నేపథ్యంలో అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!