
జనరల్

అన్నాడీఎంకే లో అంతర్గత విభేదాలు మరింత బహిర్గతమయ్యాయి. పార్టీ శాసనసభ పక్ష నాయకత్వం కోసం రెండు వర్గాలు వేర్వేరుగా తమ అభ్యర్థులను ప్రతిపాదించినట్లు సమాచారం. సుమారు 30 మంది ఎమ్మెల్యేలు ఎస్పీవేలుమణి కు మద్దతు ప్రకటించగా, మరో 17 మంది ఎమ్మెల్యేలు ఎడప్పాడిపళనిస్వామి కి మద్దతుగా నిలిచినట్లు తెలుస్తోంది.
రెండు వర్గాలు తమ తమ మద్దతు లేఖలను అసెంబ్లీ కార్యదర్శికి సమర్పించినట్లు సమాచారం. తమిళనాడు అసెంబ్లీలో అధికారికంగా ఏ వర్గాన్ని అన్నాడీఎంకేగా గుర్తిస్తారన్నది స్పీకర్ ఎన్నిక అనంతరం తేలనుంది. ఈ పరిణామాలు తమిళనాడు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారగా, పార్టీ భవిష్యత్ నాయకత్వంపై ఆసక్తికర చర్చ కొనసాగుతోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!