

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ప్రస్తుతం తన కెరీర్లో తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. ఆయన ఇటీవల తెరకెక్కించిన ‘లైగర్’, ‘డబుల్ ఇస్మార్ట్’ సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీగా నిరాశపరిచిన సంగతి తెలిసిందే. ఈ సినిమాల ఫలితాలు ఇప్పటికీ ఆయనను వెంటాడుతున్నాయి. ప్రస్తుతం పూరి జగన్నాథ్, నటుడు విజయ్ సేతుపతితో కలిసి ఒక కొత్త ప్రాజెక్ట్‌పై పని చేస్తున్నారు.
‘లైగర్’, ‘డబుల్ ఇస్మార్ట్’ సినిమాల కారణంగా బయ్యర్లు, ఎగ్జిబిటర్లు భారీ నష్టాలను చవిచూశారు. ముఖ్యంగా ‘లైగర్’ డిస్ట్రిబ్యూటర్ వరంగల్ శ్రీను కోట్లలో నష్టపోయి డిస్ట్రిబ్యూషన్ రంగం నుంచి తప్పుకున్నట్లు సమాచారం. అలాగే ‘హనుమాన్’ నిర్మాత నిరంజన్ రెడ్డి ‘డబుల్ ఇస్మార్ట్’ సినిమాను భారీ ధరకు కొనుగోలు చేసి నష్టపోయినట్లు తెలుస్తోంది. ఈ నష్టాలకు సంబంధించి పూరి జగన్నాథ్ బకాయిలు చెల్లించాల్సి ఉన్నప్పటికీ, ఇప్పటివరకు ఎలాంటి స్పందన లేకపోవడంతో ఈ విషయం ఫిల్మ్ ఛాంబర్ దాకా వెళ్లింది. డిస్ట్రిబ్యూటర్లు, ఇతర వర్గాలు ఆయన స్పందన కోసం వేచి చూస్తున్నాయి.
ఈ పరిణామాల ప్రభావం ఇప్పుడు పూరి తదుపరి చిత్రం ‘స్లమ్‌డాగ్’పై పడే అవకాశముంది. విజయ్ సేతుపతి హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ పూర్తయినప్పటికీ, రిలీజ్‌కు ముందు నాన్-థియేట్రికల్ మరియు థియేట్రికల్ డీల్స్ ఇంకా పూర్తి కాలేదు. పాత బకాయిలు చెల్లించకపోతే తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా విడుదల కష్టమవుతుందని సమాచారం. ఇదే కారణంగా మహేష్ బాబు నటించిన ‘పోకిరి’ రీ-రిలీజ్ కూడా ఆగిపోయిందని టాక్ వినిపిస్తోంది. పూరి జగన్నాథ్ బకాయిలు క్లియర్ చేసే వరకు ఆయన సినిమాలను బహిష్కరించాలని కొంతమంది ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో పూరి జగన్నాథ్ ఈ సమస్యల నుంచి ఎలా బయటపడతారో చూడాల్సి ఉంది.









.png&w=3840&q=75)



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!