
జనరల్

సినిమాల్లో చిన్న పాత్ర చేసినా ఒక్కసారిగా వైరల్ అయిపోయే నటులలో బుల్లిరాజు అలియాస్ రేవంత్ ఒకడు. సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో ఓవర్‌నైట్ స్టార్‌గా మారిన ఇతడు ప్రస్తుతం వరుస తెలుగు సినిమాలతో బిజీగా ఉన్నాడు. అతడి క్రేజ్ పెరగడంతో రెమ్యునరేషన్ కూడా హాట్ టాపిక్‌గా మారింది.
సంక్రాంతికి వస్తున్నాం హిట్ తర్వాత చిరంజీవి మన శంకరవరప్రసాద్, నవీన్ పొలిశెట్టి అనగనగా ఒకరాజు, సింగిల్ వంటి సినిమాల్లో నటించాడు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేశ్–కల్యాణ్ రామ్ సినిమాలో కూడా అవకాశం అందుకున్నాడని సమాచారం. ప్రస్తుతం రోజుకు సుమారు రూ.లక్ష పారితోషికం తీసుకుంటున్నాడని ఇండస్ట్రీ టాక్. సినిమాలతో పాటు యాడ్స్, టీవీ షోలు, మాల్ ఓపెనింగ్స్ ద్వారా కూడా మంచి ఆదాయం సంపాదిస్తున్నాడు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!