
జనరల్

హిమాచల్‌ప్రదేశ్‌లో మంచు వేగంగా కరగడంతో పలు ప్రాంతాల్లో వరద పరిస్థితులు ఏర్పడ్డాయి. ముఖ్యంగా లాహౌల్ లోయలో భారీగా నీరు ప్రవహించడంతో కీలకమైన మనాలి-లేహ్ జాతీయ రహదారి దెబ్బతింది. దీంతో ఉదయ్‌పూర్, మాయర్ లోయ ప్రాంతాలకు రవాణా పూర్తిగా నిలిచిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
వరదల కారణంగా అనేక వంతెనలు దెబ్బతినగా, పలు రహదారులు ధ్వంసమయ్యాయి. రవాణా పునరుద్ధరణ కోసం అధికారులు చర్యలు చేపడుతుండగా, కొన్ని ప్రాంతాల్లో స్థానిక ప్రజలు తాత్కాలిక ఇనుప వంతెనలను ఏర్పాటు చేసుకుని రాకపోకలు కొనసాగిస్తున్నారు. పరిస్థితిని అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తూ సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!