
గాసిప్స్

ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వినియోగిస్తున్న వాట్సాప్‌లో మరో కీలక ప్రైవసీ ఫీచర్ అందుబాటులోకి రానుంది. ఇప్పటి వరకు కొత్త వ్యక్తులతో చాట్ చేయాలంటే తప్పనిసరిగా ఫోన్ నంబర్‌ను షేర్ చేయాల్సి వచ్చేది. అయితే ఇకపై యూజర్లు తమ ఫోన్ నంబర్‌ను వెల్లడించకుండా ప్రత్యేక వినియోగదారు పేరు ద్వారా ఇతరులతో చాట్ చేసే అవకాశం కల్పించనున్నట్లు వాట్సాప్ ప్రకటించింది.
ఈ ఫీచర్‌కు సంబంధించిన వినియోగదారు పేరు నమోదు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. తాజా వాట్సాప్ వెర్షన్‌లో సెట్టింగ్స్ > అకౌంట్ > వినియోగదారు పేరు విభాగంలోకి వెళ్లి తమకు నచ్చిన పేరును ముందుగానే నమోదు చేసుకోవచ్చు. ఈ ఫీచర్‌ను ప్రపంచవ్యాప్తంగా దశలవారీగా విడుదల చేస్తుండగా, ఈ ఏడాది చివరినాటికి అందరికీ అందుబాటులోకి తీసుకురానున్నారు.

కామెంట్స్ (1)
Very useful feature