

తెలంగాణ పోలీసు శాఖ ఆరోగ్య భద్రత పథకానికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. 2026 జూలై 1 నుంచి ఆరోగ్య భద్రత పథకం కింద ఎంపానెల్ ఆసుపత్రుల్లో పోలీసు సిబ్బంది, వారి కుటుంబ సభ్యులకు అందిస్తున్న క్యాష్‌లెస్ వైద్య చికిత్స సేవలను నిలిపివేస్తున్నట్లు శాఖ సర్క్యులర్ జారీ చేసింది. ప్రభుత్వం అమలు చేయనున్న కొత్త ఆరోగ్య పథకం నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.
రాష్ట్ర ప్రభుత్వం ఎంప్లాయీస్ హెల్త్ కేర్ ట్రస్ట్ (EHCT) ఆధ్వర్యంలో కొత్త ఆరోగ్య పథకాన్ని అమలు చేయనుంది. ఇందుకోసం ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల మూల వేతనంలో 1.5 శాతం చందా వసూలు చేయాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఆరోగ్య భద్రత పథకానికి సంబంధించిన నెలవారీ చందా వసూళ్లను 2026 జూన్ జీతం నుంచే నిలిపివేశారు. ప్రస్తుతం ఈ పథకం ద్వారా ప్రతి నెల సుమారు 3,000 వైద్య బిల్లులు పరిష్కరించబడుతున్నాయని, ప్రభుత్వం నుంచి వైద్య రీయింబర్స్‌మెంట్ అందే అవకాశం లేకపోవడంతో క్యాష్‌లెస్ సేవలను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు సర్క్యులర్‌లో వెల్లడించారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!