

మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా వశిష్ట దర్శకత్వంలో రూపొందుతున్న ‘విశ్వంభర’ చిత్రంపై మరో ఆసక్తికరమైన సమాచారం బయటకు వచ్చింది. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సామాజిక ఫాంటసీ చిత్రానికి సంబంధించిన దృశ్య ప్రభావాల పనులు పూర్తయ్యాయని తెలుస్తోంది. తాజాగా ఆ దృశ్యాలను చిత్రబృందంతో కలిసి చిరంజీవి వీక్షించినట్లు ప్రచారం జరుగుతోంది. తెరపై కనిపించే నాణ్యతపై చిత్రబృందం పూర్తి సంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. దీంతో విడుదల తేదీపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశముందని సినీ వర్గాలు చెబుతున్నాయి.
త్రిష కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో ఫాంటసీ ప్రపంచంతో పాటు కుటుంబ భావోద్వేగాలు, వినోదాత్మక అంశాలకు కూడా ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలుస్తోంది. సృష్టి, స్థితి, లయ అనే భావనల చుట్టూ కథ సాగనున్నట్లు సమాచారం. కీరవాణి సంగీతం అందిస్తుండగా, యూవీ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని భారీ వ్యయంతో నిర్మిస్తోంది. ఆషిక రంగనాథ్, రమ్య పసుపులేటి, ఇషా చావ్లా, అశ్రిత వేముగంటి నండూరి కీలక పాత్రలు పోషిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!