

కన్నడ సినీ పరిశ్రమ నుంచి వచ్చిన రుక్మిణి వసంత్, తక్కువ సమయంలోనే సౌత్ ఇండియాలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్లలో ఒకరిగా ఎదిగింది. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తర్వాత వేగంగా గుర్తింపు తెచ్చుకున్న ఆమె, స్టార్ హీరోల సరసన అవకాశాలు అందుకుంటూ వరుస విజయాలు సాధిస్తోంది. ఈ ఏడాది ‘కాంతార: చాప్టర్ 1’ చిత్రంలో ప్రతినాయక పాత్రలో కనిపించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ప్రస్తుతం వరుస ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ బిజీ షెడ్యూల్ కొనసాగిస్తోంది. ఇదే సమయంలో ఆమె మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌ను ఓకే చేసినట్లు సమాచారం.
ఇక గతేడాది ‘తండేల్’తో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న నాగచైతన్య ప్రస్తుతం మైథలాజికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న NC24 చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రానికి ‘వృషకర్మ’ అనే టైటిల్ ఖరారు చేయగా, షూటింగ్ కొనసాగుతోంది. ఇదిలా ఉండగా నాగచైతన్య మరో కొత్త ప్రాజెక్ట్‌కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్ వినిపిస్తోంది. ఆ చిత్రంలో హీరోయిన్గా రుక్మిణి వసంత్‌ను ఎంపిక చేసినట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే ఈ కాంబినేషన్ ఖరారైందని, త్వరలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశముందని సమాచారం. ఈ వార్తలతో సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతూ, “న్యూ కాంబో లోడింగ్” అంటూ నెటిజన్లు ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!