

హీరో అక్కినేని నాగచైతన్య ఈ ఏడాది విడుదలైన తండేల్ సినిమాతో తన కెరీర్లోనే పెద్ద విజయాన్ని అందుకున్నాడు. ఈ సినిమా రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సాలిడ్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఇక ఆయన ప్రస్తుతం తన కెరీర్‌లోని 24వ చిత్రాన్ని కార్తీక్ దండు డైరెక్షన్లో చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తి మిస్టిక్ థ్రిల్లర్‌గా రూపొందిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ తర్వాత ఆయన కెరీర్లో ఎంతో కీలకమైన 25వ సినిమా రాబోతోంది.
ఈ 25వ చిత్రానికి సంబంధించిన వార్తలు ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ఈ సినిమాను బోయపాటి శ్రీను లేదా కొరటాల శివ లాంటి టాప్ డైరెక్టర్లతో చేస్తారని అభిమానులు భావించారు. కానీ తాజా సమాచారం ప్రకారం, బెదురులంక 2012 సినిమా దర్శకుడు క్లాక్స్ చైతన్యకు ఓ కథ వినిపించగా, అది ఆయనకు నచ్చినట్టు తెలుస్తోంది. దీంతో యంగ్ డైరెక్టర్‌తోనే తన ల్యాండ్‌మార్క్ సినిమాను చేయాలని చైతు ఆసక్తి చూపుతున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. నిజంగానే ఈ నిర్ణయం ఫైనల్ అవుతుందా? లేక వేరే దర్శకుడికి అవకాశం ఇస్తాడా? అన్నది వేచి చూడాల్సిందే.



.webp&w=3840&q=75)
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!