

టాలీవుడ్లో మెగాస్టార్ చిరంజీవి సినిమాలపై ఎప్పుడూ భారీ అంచనాలు ఉంటాయి. ఇటీవల సంక్రాంతి సందర్భంగా విడుదలైన మన శంకర వరప్రసాద్ గారు సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించడంతో ఆయన మరోసారి ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఈ విజయంతో చిరంజీవి తన తదుపరి చిత్రంపై దృష్టి పెట్టారు. ప్రస్తుతం తాత్కాలికంగా “మెగా 158” గా పిలుస్తున్న ఈ సినిమాను దర్శకుడు బాబీ కొల్లి తెరకెక్కించనున్నారు. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన 'వాల్తేరు వీరయ్య' మంచి విజయం సాధించడంతో ఈ ప్రాజెక్ట్‌పై అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది.
సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా యాక్షన్‌తో పాటు భావోద్వేగాలకు ప్రాధాన్యం ఇచ్చే కమర్షియల్ ఎంటర్టైనర్గా ఉండనుంది. ముఖ్యంగా తండ్రీ - కూతుళ్ల మధ్య ఉన్న భావోద్వేగం కథలో కీలకంగా ఉండనుందని చెబుతున్నారు. ఈ సినిమాలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఒక ముఖ్య పాత్రలో కనిపించే అవకాశముందని వార్తలు వస్తున్నాయి. హీరోయిన్గా ప్రియమణి నటించే అవకాశం ఉందని కూడా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయాలపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు.
ఇదిలా ఉంటే చిరంజీవి కూతురు పాత్ర కోసం మొదట కృతి శెట్టి పేరు వినిపించింది. తరువాత సారా అర్జున్ పేరు కూడా చర్చలోకి వచ్చింది. కానీ తాజా సమాచారం ప్రకారం మలయాళ నటి అనస్వర రాజన్ ఈ పాత్రకు దాదాపు ఫైనల్ అయినట్లు తెలుస్తోంది. సహజ నటనకు మంచి పేరు తెచ్చుకున్న ఆమె ఈ పాత్రకు సరిపోతుందని దర్శకుడు భావిస్తున్నారట. 2017లో వచ్చిన 'ఉధారణం సుజాత' ద్వారా సినీ రంగంలోకి వచ్చిన అనస్వర, తరువాత పలు మలయాళ సినిమాల్లో నటించి గుర్తింపు పొందింది. అలాగే 'నేరు' సినిమాలో చూపులేని యువతిగా చేసిన నటనకు ప్రశంసలు దక్కాయి. ఇప్పటికే తెలుగులో కూడా అడుగుపెట్టిన ఆమెకు “మెగా 158” అవకాశం దక్కితే అది ఆమె కెరీర్లో పెద్ద మైలురాయిగా మారే అవకాశం ఉంది. ఈ సినిమా పూజా కార్యక్రమాలు ఈ నెల చివర్లో జరిగి, తర్వాత రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కావచ్చని సమాచారం.









.jpg&w=3840&q=75)



.jpeg&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!