
సినిమాలు

దర్శకుడు అట్లీ ముంబైలో విలాసవంతమైన కొత్త నివాసాన్ని కొనుగోలు చేసినట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. బాలీవుడ్లో జవాన్ చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్న ఆయన, బాంద్రాలో సముద్రతీరానికి సమీపంలో ఉన్న అత్యాధునిక అపార్ట్‌మెంట్‌ను సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఈ లగ్జరీ నివాసం విలువ సుమారు రూ.38 కోట్లుగా ప్రచారం జరుగుతున్నప్పటికీ, దీనిపై అట్లీ నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు.
దక్షిణాది, బాలీవుడ్ చిత్ర పరిశ్రమల్లో వరుస విజయాలతో అట్లీ క్రేజ్, బ్రాండ్ విలువ పెరుగుతున్న నేపథ్యంలో ఈ నివాసం కొనుగోలు వార్త హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం అల్లు అర్జున్‌తో రాకా చిత్రాన్ని తెరకెక్కిస్తున్న అట్లీ పాన్ ఇండియా స్థాయిలో బిజీగా ఉన్నారు. అత్యాధునిక సౌకర్యాలు, సముద్ర వీక్షణతో కూడిన ఈ అపార్ట్మెంట్ సినీ ప్రముఖుల దృష్టిని ఆకర్షిస్తున్నట్లు తెలుస్తోంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!