

స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ హీరోగా తెరకెక్కిన ‘డీసీ’ చిత్రం కేరళలో అద్భుతమైన వసూళ్లను సాధిస్తూ దూసుకెళ్తోంది. మంచి కంటెంట్ ఉంటే భాషతో సంబంధం లేకుండా ప్రేక్షకులు సినిమాను ఆదరిస్తారనే విషయాన్ని ఈ చిత్రం మరోసారి నిరూపిస్తోంది. కేరళలో నమోదవుతున్న వసూళ్లు తమిళనాడు, రెండు తెలుగు రాష్ట్రాల్లో సాధిస్తున్న వసూళ్లకు దాదాపు సమానంగా ఉన్నట్లు సమాచారం. ఈ సినిమా కేరళలో తొలిరోజు సుమారు 45 లక్షల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది. అయితే మొదటి సోమవారం నుంచి మాత్రం ప్రారంభ రోజు వసూళ్ల కంటే 3 రెట్లకు పైగా వసూళ్లు సాధిస్తున్నట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. అంటే దాదాపు ఈ సినిమా 2 కోట్ల దాకా గ్రాస్ వసూలు చేస్తుంది.
సాధారణంగా వీక్ డేస్ లో సినిమాల వసూళ్లలో తగ్గుదల కనిపిస్తుంది. కానీ ‘డీసీ’ విషయంలో అందుకు భిన్నమైన పరిస్థితి కనిపిస్తోంది. వారాంతం తర్వాత కూడా ప్రేక్షకుల ఆదరణ కొనసాగుతుండటంతో చిత్రబృందంలో ఉత్సాహం పెరిగింది. కేరళలో సినిమాకు లభిస్తున్న ఈ స్థాయి స్పందన దాని కంటెంట్‌పై ఉన్న నమ్మకాన్ని సూచిస్తోందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ఇదే జోరు కొనసాగితే ఈ ఏడాది కేరళలో అత్యధిక వసూళ్లు సాధించిన కోలీవుడ్ చిత్రంగా ‘డీసీ’ నిలిచే అవకాశం ఉందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో కేరళ వసూళ్లపై అందరి దృష్టి పడింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!