

తెలుగు చిత్రసీమలో ఇతర భాషల కథానాయికలకు పెరుగుతున్న పారితోషికాలపై మరోసారి చర్చ మొదలైంది. స్థానికంగా కథానాయికల ఎంపికకు కొన్ని పరిమితులు ఉండటంతో దర్శకులు మలయాళం, తమిళం తదితర భాషల నుంచి నటీమణులను తీసుకుంటున్నారని సినీ వర్గాల్లో అభిప్రాయం ఉంది. ఈ నేపథ్యంలో మలయాళ నటి మెరిన్ ఫిలిప్ ‘అనుమాన పక్షి’తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం కానున్నారు. ఈ సినిమా కోసం తన మాతృభాషలో సాధారణంగా అందుకునే పారితోషికం కంటే దాదాపు ఆరు రెట్లు ఎక్కువగా పారితోషికం అందుకున్నట్లు ఆమె ఓ ఇంటర్వ్యూలో వెల్లడించినట్లు సమాచారం.
ఇప్పటికే మమిత బైజు, అనస్వర రాజన్ వంటి మలయాళ నటీమణులకు కూడా తెలుగు సినిమాల కోసం భారీ పారితోషికాలు ఇస్తున్నారనే ప్రచారం ఉంది. దీనిపై మలయాళ చిత్ర పరిశ్రమలోనూ చర్చ జరుగుతోంది. అయితే తెలుగు సినిమాల నిర్మాణ వ్యయం, షూటింగ్ రోజులు ఎక్కువగా ఉండటంతోనే పారితోషికాలు కూడా ఆ స్థాయిలో ఉంటాయని నిర్మాతల వాదన. రాగ్ మయూర్ హీరోగా నటించిన ‘అనుమాన పక్షి’కి ‘డీజే టిల్లు’ ఫేమ్ విమల్ కృష్ణ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!