

నేచురల్ స్టార్ నాని నటించిన తాజా చిత్రం ‘ది ప్యారడైజ్’. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన ఈ సినిమాపై విడుదలకు ముందే భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘దసరా’ విజయానంతరం నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వచ్చిన ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమాకు కొందరి నుంచి మంచి స్పందన వస్తుండగా, మరోవైపు సోషల్ మీడియాలో విమర్శలు, ట్రోల్స్ కూడా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ‘ది ప్యారడైజ్’పై వస్తున్న స్పందనపై నాని ప్రత్యేకంగా స్పందించారు.
తనకు వచ్చిన ప్రేక్షకుల స్పందనలన్నింటినీ చూశానని నాని తెలిపారు. ప్రేక్షకులు చూపించిన ప్రేమతో పాటు సరదాగా చేసిన ట్రోల్స్‌ను కూడా ఆస్వాదించానని చెప్పారు. ప్రేక్షకులు సినిమాను తమదిగా స్వీకరించిన తీరు, విమర్శకులు, సమీక్షకులు ఎత్తి చూపిన అంశాల నుంచి నేర్చుకునే అవకాశం లభించడం తనకు ఆనందాన్ని ఇచ్చిందన్నారు. ప్రేక్షకులకు ప్రత్యేకమైన అనుభూతిని అందించేందుకు చిత్రబృందం ఎంతో కష్టపడి సినిమాను రూపొందించిందని, దాన్ని ఆస్వాదించడమో లేదా విమర్శించడమో ప్రేక్షకుల ఇష్టమని పేర్కొన్నారు. సినిమాపై చూపించిన ఉత్సాహానికి, తనపై కురిపించిన అభిమానానికి నాని కృతజ్ఞతలు తెలిపారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!