

కెరీర్ ప్రారంభంలో తాను ఎదుర్కొన్న చేదు అనుభవాలను నటి తాప్సీ తాజాగా వెల్లడించారు. ఎలాంటి స్పష్టమైన కారణం చెప్పకుండానే పలుమార్లు సినిమాల నుంచి తనను తప్పించారని తెలిపారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన తాప్సీ.. ఒకసారి తాను నటించాల్సిన సినిమా నుంచి చివరి నిమిషంలో తప్పించారని చెప్పారు. కారణం అడిగితే.. ‘హీరో భార్యకు నువ్వు నచ్చలేదు’ అని చెప్పారని, ఆ సమాధానం తనను షాక్‌కు గురిచేసిందని తెలిపారు. మరో సినిమాలో హీరోనే తనను తప్పించారని, బాలీవుడ్‌లో ఓ సినిమా నుంచి తనను తొలగించిన విషయం తనకంటే ముందే మీడియాకు తెలిసిందని తాప్సీ పేర్కొన్నారు. ఆ తర్వాత చిత్రబృందం తనకు ఫోన్ చేసి క్షమాపణలు చెప్పినా, అసలు కారణాన్ని మాత్రం వెల్లడించలేదని చెప్పారు.
కెరీర్ తొలినాళ్లలో బోల్డ్ సన్నివేశాల విషయంలో తనకు పెద్దగా అవగాహన ఉండేది కాదని తాప్సీ తెలిపారు. షూటింగ్ సమయంలో అవన్నీ సాధారణమేనని భావించానని, పరిశ్రమలో కొత్తగా ఉండటంతో అందరూ ఇలాగే చేస్తారని అనుకునేదానినని చెప్పారు. అయితే, సినిమా తెరపై చూసిన తర్వాత అవసరం లేకపోయినా తనను అలా చూపించారని అర్థమైందన్నారు. బోల్డ్ సన్నివేశాలు లేకుండానే సినిమాలో గ్లామర్‌గా కనిపించవచ్చని ఆ తర్వాత తెలుసుకున్నానని చెప్పారు. ప్రస్తుతం తాప్సీ నటించిన ‘గాంధారి’ నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!