

నటుడు సంపూర్ణేష్ బాబుపై సీనియర్ జర్నలిస్ట్ నాగేంద్ర కుమార్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వివాదానికి దారితీశాయి. ఓ ఇంటర్వ్యూలో సంపూర్ణేష్ బాబు సినీ పరిశ్రమలోకి రావడం, ఆయన కుటుంబ నేపథ్యం, నటుడిగా అవకాశాలపై నాగేంద్ర కుమార్ ప్రశ్నలు సంధిస్తూ వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడిన తీరుపై పలువురు నెటిజన్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సంపూర్ణేష్ బాబు తాజాగా వీడియో ద్వారా స్పందించారు.
నాగేంద్ర కుమార్ తనకు చాలా సన్నిహితమైన వ్యక్తి అని సంపూర్ణేష్ బాబు తెలిపారు. ఆయన చేసిన వ్యాఖ్యలను ఎవరూ తప్పుగా అర్థం చేసుకోవద్దని కోరారు. తమ మధ్య ఉన్న సన్నిహిత్యం కారణంగానే సంభాషణలో కొన్ని మాటలు దొర్లాయని చెప్పారు. అనంతరం నాగేంద్ర కుమార్ కూడా వీడియో విడుదల చేసి, సంపూర్ణేష్ బాబు తనకు చాలా కాలంగా తెలుసని, వారి మధ్య ఉన్న సన్నిహిత్యం నేపథ్యంలోనే కొన్ని వ్యాఖ్యలు చేశానని తెలిపారు. తన మాటలతో బాధపడిన సంపూర్ణేష్ బాబు, ఆయన అభిమానులు, ఇతరులకు క్షమాపణలు చెప్పారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!