

శ్రీకాంత్ ఓదెల–నాని కాంబినేషన్‌లో భారీ అంచనాల మధ్య విడుదలైన ‘ది ప్యారడైజ్’కు ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది. పెయిడ్ ప్రీమియర్లు ప్రారంభమైనప్పటి నుంచే సినిమాపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా కథనం బలహీనంగా ఉందని, హింసాత్మక సన్నివేశాలు ఎక్కువగా ఉన్నాయని, ద్వితీయార్ధంలో సన్నివేశాల మధ్య అనుసంధానం సరిగా లేదని కొందరు ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు.
విడుదలకు ముందు శ్రీకాంత్ ఓదెల మేకింగ్ శైలిపై ప్రశంసలు వచ్చినప్పటికీ, ప్రస్తుతం కథా రచన, తెరకెక్కించిన విధానంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చిత్రీకరణకు ముందే పూర్తి కథ, స్క్రీన్‌ప్లే సిద్ధంగా లేకపోవడంతో షూటింగ్ సమయంలో మార్పులు జరిగాయని, ఎడిటింగ్ దశలో కొన్ని సన్నివేశాలను తొలగించాల్సి వచ్చిందనే ప్రచారం కూడా సాగుతోంది. అయితే ఈ అంశాలపై చిత్రబృందం నుంచి అధికారికంగా ఎలాంటి స్పష్టత వెలువడలేదు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!