

నేచురల్ స్టార్ నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ డ్రామా ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతోంది. సెప్టెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా తొలి రోజే భారీ వసూళ్లు సాధించినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు రూ. 88 కోట్లు రాబట్టినట్లు సమాచారం. ఇక భారత్‌లో రూ. 34.65 కోట్ల నెట్ వసూళ్లు సాధించింది. పూర్తి స్థాయి లెక్కలు వెలువడితే ఈ మొత్తం మరింత పెరిగే అవకాశం ఉంది.
నాని గత చిత్రాలైన ‘దసరా’ తొలి రోజు రూ. 23.20 కోట్లు, ‘హిట్: 3’ రూ. 21 కోట్లు వసూలు చేయగా ‘ది ప్యారడైజ్’ వాటిని అధిగమించింది. తెలుగు వెర్షన్‌లో రూ. 25.10 కోట్ల నెట్ వసూళ్లు రాగా, హిందీలో రూ. 1.82 కోట్లు, తమిళంలో రూ. 1.02 కోట్లు నమోదయ్యాయి. ‘దసరా’ తర్వాత నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వచ్చిన ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగ్గట్టుగానే అడ్వాన్స్ బుకింగ్స్, భారీ విడుదలతో సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!