

తమిళనాడు రాజకీయాల్లో విజయ్‌తో త్రిష పేరుపై చర్చ జరుగుతున్న సమయంలో, ఆమెకు సంబంధించి మరో ఆసక్తికరమైన వార్త కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. దివంగత నటి, మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవిత కథ ఆధారంగా తెరకెక్కనున్న సినిమాలో ఆమె పాత్రను త్రిష పోషించనున్నారనే ప్రచారం మొదలైంది. ఎంజీఆర్ బయోపిక్‌లో జయలలిత పాత్ర కోసం చిత్ర బృందం త్రిషను సంప్రదిస్తున్నట్లు సమాచారం వినిపిస్తోంది. దీంతో ఈ ప్రాజెక్టుపై సినీ అభిమానుల్లో ఆసక్తి పెరుగుతోంది. ఇప్పటికే త్రిష రూపం, వ్యక్తిత్వాన్ని జయలలితతో పోలుస్తూ పలువురు చర్చించుకుంటున్నారు. ఇప్పుడు అదే పోలికల మధ్య ఆమె నిజంగానే వెండితెరపై అమ్మగా కనిపిస్తారా? అనే ప్రశ్నలు మొదలయ్యాయి.
అయితే ఈ వార్తకు సంబంధించి చిత్ర బృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. త్రిష కూడా ఈ ప్రాజెక్టుపై స్పందించలేదు. ఒకవేళ ఈ ప్రచారం నిజమైతే, ఆమె కెరీర్లో ఇదొక ప్రత్యేకమైన పాత్రగా నిలిచే అవకాశం ఉంది. జయలలిత రాజకీయ ప్రస్థానం, సినీ జీవితం రెండూ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించే అంశాలే. ముఖ్యంగా ఎంజీఆర్‌తో ఆమెకున్న అనుబంధాన్ని సినిమాలో ఎలా చూపిస్తారన్నది కీలకంగా మారనుంది. త్రిష నటన, హావభావాలు ఈ పాత్రకు ఎంతవరకు సరిపోతాయనే చర్చ కూడా సాగుతోంది. ప్రస్తుతానికి ఇదంతా ప్రచారానికే పరిమితమైన నేపథ్యంలో, అధికారిక సమాచారం వచ్చే వరకు వేచి చూడాల్సిందే.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!