

ఎన్టీఆర్ నుంచి మరోసారి పూర్తి స్థాయి వినోదభరితమైన సినిమా రావాలని అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు. 'అదుర్స్'లో ఆయన పోషించిన చారి పాత్రకు ఇప్పటికీ ప్రత్యేకమైన అభిమాన గణం ఉంది. అదే తరహాలో మరోసారి హాస్యంతో ప్రేక్షకులను అలరించాలని తారక్ భావిస్తున్నట్లు సమాచారం. మరోవైపు త్రివిక్రమ్‌తో చేయబోయే సినిమా కోసం ఏడాది పాటు ముందస్తు పనులు జరిగే అవకాశం ఉందట. ఈలోపు తేలికపాటి కథతో ఒక సినిమా చేస్తే బాగుంటుందని ఎన్టీఆర్ ఆలోచిస్తున్నారట. ఇలాంటి వినోదాత్మక చిత్రాలను సమర్థంగా తెరకెక్కించగల దర్శకుడిగా అనిల్ రావిపూడికి గుర్తింపు ఉండటంతో ఆయనతో సినిమా చేయడానికి ఆసక్తి చూపించినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ కలయికపై అభిమానుల్లో ఇప్పటికే అంచనాలు మొదలయ్యాయి.
అనిల్ రావిపూడికి సంక్రాంతి సీజన్ బాగా కలిసొచ్చింది. 'ఎఫ్ 2', 'సరిలేరు నీకెవ్వరు', 'సంక్రాంతికి వస్తున్నాం', 'మన శంకర్ వర ప్రసాద్' చిత్రాలతో విజయాలు అందుకున్నారు. దీంతో ఆయనకు సంక్రాంతి దర్శకుడనే గుర్తింపు కూడా వచ్చింది. మరో ప్రత్యేకత ఏమిటంటే, స్టార్ హీరోలతో సినిమాలు చేసినా ఏడాదిలోనే చిత్రీకరణ పూర్తి చేసి విడుదల చేయడం అనిల్‌కు అలవాటు. ఇప్పుడు ఎన్టీఆర్ లాంటి అగ్ర కథానాయకుడితో కూడా అదే వేగాన్ని కొనసాగించగలరా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా తారక్ కోరుకుంటున్న వినోదాత్మక కథను ఆయన ఏ విధంగా సిద్ధం చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఈ ప్రాజెక్టు కార్యరూపం దాలిస్తే అభిమానులకు మరోసారి 'అదుర్స్' తరహా వినోదం దక్కుతుందేమో చూడాలి.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!