

నందమూరి బాలకృష్ణ, దర్శకుడు గోపీచంద్ మలినేని కలయికలో తెరకెక్కుతున్న ‘దాదా’ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే సినిమా ప్రమోషన్స్ ప్రారంభం కాగా, డిసెంబర్ 24, 2026న విడుదల చేసేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో సినిమా టీజర్‌ను కూడా సిద్ధం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. టీజర్లో బాలకృష్ణ సరికొత్త లుక్‌లో కనిపించనున్నారని, ఆయనకు సంబంధించిన ఎలివేషన్ సన్నివేశాలు చాలా పవర్‌ఫుల్‌గా ఉంటాయని సమాచారం. చివర్లో వచ్చే డైలాగ్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుందని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే, టీజర్‌కు సంబంధించిన ఈ వివరాలపై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, సముద్రఖని, మంచు మనోజ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్లో గతంలో వచ్చిన ‘వీరసింహారెడ్డి’ మంచి విజయాన్ని అందుకుంది. ఆ సినిమా తర్వాత వీరిద్దరూ కలిసి చేస్తున్న రెండో చిత్రం ‘దాదా’. వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీశ్ కిలారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బాలకృష్ణ కొత్త మేకోవర్‌పై వస్తున్న ప్రచారం, టీజర్‌పై నెలకొన్న ఆసక్తితో ఈ సినిమా వార్తల్లో నిలుస్తోంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!