

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు బోయపాటి శ్రీను కలయికలో వచ్చిన ‘సరైనోడు’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బన్నీ మాస్ ఇమేజ్‌కు బోయపాటి తనదైన శైలిలో యాక్షన్ జోడించడంతో ప్రేక్షకులకు అదిరిపోయే వినోదం అందింది. ఇప్పుడు ఈ విజయవంతమైన కలయిక మరోసారి తెరపైకి రాబోతున్నట్లు టాలీవుడ్‌లో ఆసక్తికర ప్రచారం జరుగుతోంది.
గీతా ఆర్ట్స్ ఈ క్రేజీ కాంబినేషన్‌లో మరో భారీ చిత్రాన్ని నిర్మించేందుకు సిద్ధమవుతోందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈసారి కథలో పౌరాణిక అంశాలను కూడా జోడించబోతున్నట్లు సమాచారం. పురాణ కథలపై బోయపాటి శ్రీనుకు ఉన్న అవగాహన, వాటిని తనదైన శైలిలో తెరకెక్కించే సామర్థ్యం ఈ ప్రాజెక్టుపై ఆసక్తిని పెంచుతున్నాయి. ఈ కథాంశం నచ్చడంతో బన్నీ కూడా సినిమా చేసేందుకు సానుకూలంగా స్పందించినట్లు ప్రచారం సాగుతోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!