

సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన జైలర్ 2 కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ హక్కులను నిర్మాత ఎస్ నాగవంశీ సొంతం చేసుకున్నారు. అయితే, ఆంధ్రప్రదేశ్‌లో టికెట్ ధరల పెంపునకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో కొత్త వివాదం మొదలైంది. మల్టీప్లెక్స్‌లలో రూ.75, సింగిల్ స్క్రీన్లలో రూ.50 అదనంగా పెంచుకునేందుకు అనుమతి లభించినట్లు సమాచారం. దీంతో సినిమా టికెట్ల ధరల అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
మరోవైపు, తెలంగాణలో మాత్రం సాధారణ టికెట్ ధరలే కొనసాగనున్నట్లు తెలుస్తోంది. తమిళనాడులోనూ ధరల పెంపు లేకపోవడంతో ఆంధ్రప్రదేశ్‌లో తీసుకున్న నిర్ణయంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా నాగవంశీతో పాటు రాష్ట్ర ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని పలువురు అభ్యంతరాలు చెబుతున్నారు. భారీ అంచనాలున్న సినిమా అయినప్పటికీ, ప్రేక్షకులపై అదనపు భారం వేయడం అవసరమా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సాధారణ ధరలకే జైలర్ 2 విడుదల చేసి ఉంటే బాగుండేదని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఈ పరిణామాలు సినిమా విడుదలకు ముందే చర్చకు దారితీశాయి.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!