

నేషనల్ అవార్డు విజేత, ప్రముఖ నటుడు ధనుష్ మరోసారి దర్శకుడు ఆనంద్ ఎల్ రాయ్‌తో కలిసి పనిచేయనున్నట్లు సమాచారం. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘రాంఝనా’, ‘అత్రంగి రే’, ‘తేరే ఇష్క్ మే’ చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇప్పుడు మరోసారి ఈ ఇద్దరూ జతకట్టేందుకు సిద్ధమవుతున్నట్లు వెరైటీ ఇండియా కథనం వెల్లడించింది. వీరి కలయికలో రానున్న ఈ నాలుగో సినిమా రొమాంటిక్ పీరియడ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కనుందని సమాచారం.
ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో రూపొందించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రేమకథతో పాటు ఉత్కంఠభరితమైన పోరాట సన్నివేశాలు, భారీ యాక్షన్ సీక్వెన్స్‌లు ఇందులో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయని కథనం పేర్కొంది. గత కాలం నాటి ప్రపంచాన్ని ప్రతిబింబించేలా ప్రత్యేకమైన సెట్స్, వాతావరణాన్ని పునఃసృష్టించనున్నట్లు సమాచారం. ధనుష్, ఆనంద్ ఎల్ రాయ్ కలిసి ఇప్పటివరకు ప్రయత్నించని కొత్త జానర్లో ఈ సినిమా ఉండనుందని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని 2027 మధ్యలో సెట్స్‌పైకి తీసుకెళ్లాలని భావిస్తున్నట్లు సమాచారం.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!