

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఫౌజీ’ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. మరోవైపు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతున్న ‘స్పిరిట్’ కూడా ఆయన లైనప్‌లో ఉంది. ‘ఫౌజీ’ షూటింగ్‌పై దృష్టి పెట్టేందుకు ప్రభాస్ ‘స్పిరిట్’ చిత్రీకరణను తాత్కాలికంగా వాయిదా వేసినట్లు సమాచారం. తాజా నివేదికల ప్రకారం, 2026 డిసెంబర్ 15 నుంచి ప్రభాస్ మళ్లీ ‘స్పిరిట్’ సెట్స్‌లో అడుగుపెట్టనున్నారు. ఈ సినిమా కోసం కొన్ని రోజుల పాటు షూటింగ్లో పాల్గొన్న అనంతరం తిరిగి ‘ఫౌజీ’ చిత్రీకరణలో భాగం కానున్నట్లు తెలుస్తోంది.
‘స్పిరిట్’ చిత్రాన్ని టీ-సిరీస్, భద్రకాళి పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమాలో ప్రభాస్ సరసన త్రిప్తి డిమ్రి కథానాయికగా నటిస్తోంది. వివేక్ ఒబెరాయ్ ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్నారు. ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా కలయికలో వస్తున్న సినిమా కావడంతో ఈ ప్రాజెక్టుపై ప్రేక్షకుల్లో భారీ ఆసక్తి నెలకొంది. సినిమాకు సంబంధించిన ఇతర కీలక వివరాలను చిత్ర బృందం త్వరలో వెల్లడించే అవకాశం ఉంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!