

బాలకృష్ణ, కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కనున్న కొత్త సినిమాకు సంగీత దర్శకుడిగా జీవీ ప్రకాష్ కుమార్ ఖరారైనట్లు సమాచారం. మొదట ఈ ప్రాజెక్ట్ కోసం అనిరుధ్ పేరును పరిశీలించినప్పటికీ, చివరకు జీవీ ప్రకాష్‌ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఈ చిత్రానికి సంగీతంపై ఆసక్తి పెరుగుతోంది. విభిన్నమైన సంగీతంతో గుర్తింపు తెచ్చుకున్న జీవీ ప్రకాష్, బాలయ్య సినిమాకు ఎలాంటి పాటలు అందిస్తారనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ఇక ఈ సినిమాకు సంబంధించిన కథను కొరటాల శివ ఇప్పటికే పూర్తి చేసినట్లు సమాచారం. అన్ని పనులు అనుకున్నట్లుగా జరిగితే వచ్చే ఏడాది ప్రారంభంలో చిత్రీకరణ మొదలయ్యే అవకాశం ఉంది. బాలకృష్ణకు తగ్గట్టుగా పవర్ఫుల్ కథను సిద్ధం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే నటీనటులు, ఇతర సాంకేతిక బృందం వివరాలపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ కాంబినేషన్‌పై అభిమానుల్లో ఇప్పటి నుంచే ఆసక్తి నెలకొంది.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!