
సినిమాలు

మన టాలీవుడ్ సీనియర్ హీరో వెంకటేష్, హీరోయిన్ శ్రీనిధి శెట్టి జంటగా, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కిస్తున్న ఆదర్శ కుటుంబం సినిమా అనౌన్స్మెంట్ నుంచే మంచి ఆసక్తిని కలిగించింది. షూటింగ్ నెమ్మదిగా కొనసాగుతున్నప్పటికీ ఈ సినిమాపై అంచనాలు మాత్రం తగ్గలేదు. సమ్మర్ రేస్ నుంచి తప్పుకున్నట్టే కనిపిస్తున్నా, తాజా అప్డేట్స్ సినిమా మీద మళ్లీ హైప్ పెంచుతున్నాయి.
ఇప్పుడు వచ్చిన సమాచారం ప్రకారం, హరిహర వీరమల్లులో నటించిన పూజిత పొన్నాడ ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనుంది. ఆమెకు జోడీగా నారా రోహిత్ నటించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో ఆమె పాత్ర ఎలా ఉండబోతుందో చూడాలి. ఇక సంగీత దర్శకుడిగా తమన్ ఎస్, హర్షవర్ధన్ రామేశ్వర్ స్థానంలో వచ్చారు. ఈ చిత్రాన్ని హారికా హాసిని క్రియేషన్స్ నిర్మిస్తున్నారు.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!