

నితిన్ హీరోగా, దర్శకుడు వీఐ ఆనంద్ తెరకెక్కించనున్న భారీ సైఫై చిత్రం తాత్కాలికంగా నిలిచిపోయినట్లు టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. భారీ బడ్జెట్‌తో పాటు ప్రస్తుత నాన్-థియేట్రికల్ మార్కెట్లో నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల కారణంగా ఈ ప్రాజెక్ట్‌ను నెమ్మదిగా ముందుకు తీసుకెళ్లాలని నిర్మాతలు భావిస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రాన్ని భారీ విజువల్ ఎఫెక్ట్స్, గ్రాండ్ ప్రొడక్షన్ విలువలతో రూపొందించాలని మొదట ప్లాన్ చేశారు.
డిజిటల్, శాటిలైట్, ఓవర్సీస్ మార్కెట్లలో స్థిరత్వం లేకపోవడం వల్ల ఆర్థిక రిస్క్‌లపై మేకర్స్ మళ్లీ సమీక్ష చేస్తున్నట్లు తెలుస్తోంది. పెరుగుతున్న నిర్మాణ వ్యయాలు కూడా ప్రాజెక్ట్ ఆలస్యానికి కారణంగా మారినట్లు సమాచారం. అయితే మార్కెట్ పరిస్థితులు మెరుగుపడిన తర్వాత ఈ ప్రాజెక్ట్ మళ్లీ ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయని సినీ వర్గాలు భావిస్తున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!