

తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజ్ హీరోగా పరిచయమైన ‘డిసి’ చిత్రం ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద మంచి స్పందనను అందుకుంటోంది. అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను సన్ పిక్చర్స్ నిర్మించగా, అనిరుధ్ సంగీతం అందించారు. భారీ ప్రచారం లేకుండానే విడుదలైన ఈ సినిమా ప్రీమియర్ల నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. తమిళనాడుతో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ రెండో రోజు నుంచి వసూళ్లు పుంజుకున్నాయి.
ఇదిలా ఉండగా, ఈ కథ కోసం తొలుత లోకేష్ కనగరాజ్‌ను హీరోగా అనుకోలేదనే వార్త ఆసక్తిని రేపుతోంది. దర్శకుడు అరుణ్ మాథేశ్వరన్ మొదట ఈ కథను విజయ్ దేవరకొండకు వినిపించినట్లు సమాచారం. అయితే అప్పటికే తాను చేస్తున్న సినిమాల్లోని పాత్రలు, కథలతో ఈ ప్రాజెక్ట్ పోలి ఉండటంతో విజయ్ ఈ అవకాశాన్ని అంగీకరించలేదని తెలుస్తోంది. అనంతరం ఈ అవకాశం లోకేష్ కనగరాజ్‌కు వెళ్లినట్లు సమాచారం. విజయ్‌కు సంబంధించిన పాత వీడియో వైరల్ కావడంతో, ఆయన ఈ సినిమా చేసి ఉంటే ఎలా ఉండేదన్న చర్చ అభిమానుల్లో మొదలైంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!