

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ‘ఫౌజీ’ చిత్రంపై ఆసక్తికరమైన ప్రచారం జరుగుతోంది. హను రాఘవపూడి దర్శకత్వంలో భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమాను టీజర్, ట్రైలర్ విడుదల చేయకుండానే నేరుగా థియేటర్లలోకి తీసుకురావాలని మేకర్స్ ఆలోచిస్తున్నట్లు సమాచారం. మైత్రీ మూవీ మేకర్స్, టీ-సిరీస్ సంస్థలు నిర్మిస్తున్న ఈ పీరియాడికల్ చిత్రానికి రూ.700 కోట్లకు పైగా బడ్జెట్ కేటాయించినట్లు తెలుస్తోంది. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ, బెంగాలీ భాషల్లో విడుదలకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇమాన్వీ కథానాయికగా నటిస్తుండగా, మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్, జయప్రద, భానుచందర్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
టీజర్, ట్రైలర్ లేకుండా సినిమాను నేరుగా విడుదల చేయాలనే ప్రచారం ప్రభాస్ అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. సాధారణంగా భారీ చిత్రాలకు టీజర్, ట్రైలర్‌తో విస్తృత ప్రచారం నిర్వహిస్తారు. అలాంటి ప్రచారాన్ని పక్కన పెట్టి నేరుగా విడుదల చేయడం కొత్త ప్రయోగంగా నిలిచే అవకాశం ఉంది. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని డిసెంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం. డిసెంబర్ 2న ప్రత్యేక ప్రీమియర్లు ఉండొచ్చనే ప్రచారం కూడా ఉంది. అయితే టీజర్, ట్రైలర్ విడుదలపై చిత్రబృందం నుంచి ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాలేదు. దీంతో ఈ ప్రచారంపై ఉత్కంఠ కొనసాగుతోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!