

టాలీవుడ్ దర్శకుడు వంశీ పైడిపల్లి, బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ కలయికలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్పై అంచనాలు పెరుగుతున్నాయి. కథానాయికగా నయనతార నటిస్తున్న ఈ చిత్రానికి సంబంధించి తాజాగా మరో ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. ప్రముఖ బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్ ఈ సినిమాలో కీలక పాత్రను పోషిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ముంబైలో జరుగుతున్న చిత్రీకరణలో ఆయన పాల్గొంటున్నారని, సల్మాన్ ఖాన్‌తో కలిసి ముఖ్యమైన సన్నివేశాల్లో నటిస్తున్నట్లు తెలుస్తోంది.
గతంలో సల్మాన్ ఖాన్, జాకీ ష్రాఫ్ కలిసి పలు చిత్రాల్లో కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. దీంతో మరోసారి వీరిద్దరూ తెరపై కనిపించనుండటం అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. అయితే జాకీ ష్రాఫ్ ఈ సినిమాలో ప్రతినాయకుడిగా నటిస్తున్నారంటూ జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని తెలుస్తోంది. కథలో కీలక మలుపుకు కారణమయ్యే బలమైన పాత్రలో ఆయన కనిపించనున్నట్లు సమాచారం.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!