
.png&w=3840&q=75)
ప్రతి సినిమాతో సూపర్ సక్సెస్ అందుకుంటూ ప్రత్యేకమైన గుర్తింపు పొందిన దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబుతో తెరకెక్కిస్తున్న పాన్ వరల్డ్ సినిమా వారణాసి షూటింగ్‌ను వేగంగా కొనసాగిస్తున్నారు. ఇప్పటికే నాలుగు షెడ్యూల్స్ విజయవంతంగా పూర్తి కాగా, త్వరలో ఐదో షెడ్యూల్ ప్రారంభానికి సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం. వచ్చే సంవత్సరం ఏప్రిల్‌లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర బృందం లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలుస్తోంది.
మూడో షెడ్యూల్లో తెరకెక్కించిన భారీ ఫైట్ సీక్వెన్స్ ఎడిటింగ్ పనులు పూర్తయ్యాయని సమాచారం. ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ ఈ ఫైట్‌ను చూసి చాలా ఇంప్రెస్ అయ్యారని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇంకా సిజీ వర్క్ పూర్తికాకపోయినా ఆ సీక్వెన్స్ విజువల్‌గా నెక్స్ట్ లెవెల్లో ఉందని టాక్ వినిపిస్తోంది. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రపంచ స్థాయిలో భారీ అంచనాలు సృష్టిస్తోంది.







.png&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!