

హైదరాబాద్‌లో ప్రస్తుతం ట్రెండ్ అవుతున్న 1980ల రెట్రో ఫొటో క్రేజ్‌పై సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. సోషల్ మీడియాలో వ్యక్తిగత ఫొటోలను షేర్ చేసే విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ట్రెండింగ్ పేరుతో సోషల్ మీడియాలో వచ్చే APK ఫైల్స్‌ను డౌన్‌లోడ్ చేయవద్దని, తెలియని యాప్‌లను ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేయవద్దని హెచ్చరించారు. ఇలాంటి యాప్‌ల ద్వారా ఫోన్‌లోని ఫొటోలు, వ్యక్తిగత డేటా దుర్వినియోగమయ్యే అవకాశం ఉందని తెలిపారు.
ఆన్‌లైన్‌లో షేర్ చేసిన ఫొటోలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) సాయంతో మార్ఫింగ్ చేసి నకిలీ ఫొటోలు, వీడియోలు సృష్టించే ప్రమాదం ఉందని పోలీసులు హెచ్చరించారు. అనంతరం వాటిని ఉపయోగించి బాధితులను బెదిరించడం, వేధించడం లేదా బ్లాక్‌మెయిల్‌కు పాల్పడే అవకాశం ఉందని తెలిపారు. వైరల్ ట్రెండ్లలో పాల్గొనే సమయంలో వ్యక్తిగత ఫొటోలను గుర్తుతెలియని యాప్‌లు, వెబ్‌సైట్లలో అప్‌లోడ్ చేయకుండా జాగ్రత్త వహించాలని సూచించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!