

భారత యువ బ్యాటింగ్ సంచలనం వైభవ్ సూర్యవంశీపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ వసీం అక్రమ్ ప్రశంసలు కురిపించాడు. అదే సమయంలో పాకిస్థాన్ క్రికెట్ వ్యవస్థపై తీవ్ర విమర్శలు చేశాడు. పాకిస్థాన్ సూపర్ లీగ్(పీఎస్ఎల్)ను ఐపీఎల్‌తో పోల్చిన అక్రమ్.. పీఎస్ఎల్ ప్రారంభమై పదేళ్లు దాటినా జాతీయ జట్టుకు చెప్పుకోదగ్గ యువ బ్యాటర్‌ను అందించడంలో విఫలమైందని అభిప్రాయపడ్డాడు. వైభవ్ సూర్యవంశీ లాంటి ప్రతిభావంతుడైన బ్యాటర్ పాక్ నుంచి వచ్చినప్పుడే అక్కడి క్రికెట్‌లో నిజమైన మార్పు కనిపిస్తుందని వ్యాఖ్యానించాడు.
యువ ప్రతిభను వెలికితీసేందుకు పాకిస్థాన్‌లో క్లబ్ క్రికెట్ వ్యవస్థను పునరుద్ధరించడంతో పాటు దేశవాళీ క్రికెట్‌లో కీలక మార్పులు చేయాలని వసీం అక్రమ్ సూచించాడు. కరాచీ, లాహోర్‌లో క్లబ్ క్రికెట్ అభివృద్ధికి పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఒక్కో నగరానికి రూ.10 కోట్లు కేటాయించాలని పేర్కొన్నాడు. అసలైన ప్రతిభకు క్లబ్ క్రికెట్టే పునాది అని చెప్పాడు. ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లో పాకిస్థాన్ ఇప్పటికే 2-0తో వెనుకబడి ఉండగా, మూడో టెస్టులోనూ ఓటమి ముంగిట నిలిచింది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!