

నందమూరి బాలకృష్ణ వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూ ఇండస్ట్రీలో తన ప్రత్యేక స్థానాన్ని కొనసాగిస్తున్నారు. రాజకీయాలతో పాటు సినిమా రంగంలోనూ సత్తా చాటుతున్న బాలయ్య, ప్రస్తుతం దర్శకుడు గోపీచంద్ మలినేనితో కొత్త చిత్రం చేస్తున్నారు. తాత్కాలికంగా ‘ఎన్బీకే 111’ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం వేగంగా కొనసాగుతోంది.
ఈ సినిమాలో ప్రత్యేక గీతానికి సంబంధించిన ఆసక్తికర వార్త ప్రస్తుతం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. గతంలో ‘వీర సింహారెడ్డి’ చిత్రంలో చంద్రిక రవితో కలిసి సందడి చేసిన బాలయ్య, ఈసారి బాలీవుడ్ నటి నర్గీస్ ఫఖ్రీతో అడుగులు వేయనున్నట్లు సమాచారం. హైదరాబాద్లో ప్రత్యేకంగా నిర్మించిన వేదికలో ఈ పాట చిత్రీకరణ ప్రారంభం కానుందని టాక్ వినిపిస్తోంది. బాలయ్య ఉత్సాహానికి నర్గీస్ ఫఖ్రీ అందాలు జతకావడంతో మరో భారీ విజయం ఖాయమని అభిమానులు భావిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!