

బాలీవుడ్ యంగ్ బ్యూటీ వామికా గబ్బీకి 2026 సంవత్సరం వరుస అవకాశాలతో బాగా కలిసివస్తోంది. అక్షయ్ కుమార్ నటించిన భూత్ బంగ్లాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆమె, ఆ తర్వాత పతి పత్ని ఔర్ వో 2, తమిళ చిత్రం డీసీ: ది బ్లడీ వాలెంటైన్లో నటనతో ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు తన కెరీర్‌లోనే భారీ ప్రాజెక్ట్‌గా నిలిచే అవకాశం ఆమెకు దక్కినట్లు సమాచారం. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో, కాంతార ఫేమ్ రిషబ్ శెట్టి హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా మైథలాజికల్ మూవీ జై హనుమాన్లో వామికా కీలక పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది.
2024లో విడుదలై బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన హనుమాన్ చిత్రానికి సీక్వెల్‌గా జై హనుమాన్ తెరకెక్కుతోంది. ఇందులో రిషబ్ శెట్టి లార్డ్ హనుమాన్ పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. కలియుగం నేపథ్యంలో భక్తి, పురాణ అంశాలు, భారీ యాక్షన్‌తో సినిమాను రూపొందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, టీ-సిరీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగా రూపొందుతోంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మరోవైపు వామికా చేతిలో రాజ్‌కుమార్ రావుతో ప్రహార్, అడివి శేష్‌తో గూఢచారి 2, సిద్ధాంత్ చతుర్వేదితో దిల్ కా దర్వాజా ఖోల్ నా డార్లింగ్ వంటి పలు ఆసక్తికరమైన ప్రాజెక్టులు ఉన్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!