

నాగార్జున అక్కినేని కెరీర్‌లో 100వ చిత్రంగా తెరకెక్కుతున్న ప్రాజెక్ట్‌పై నెలకొన్న సస్పెన్స్‌కు త్వరలో తెరపడనుంది. తమిళ దర్శకుడు రా కార్తీక్ రూపొందిస్తున్న ఈ సినిమాలో హిందీ నటి టబు శక్తిమంతమైన ప్రతినాయకురాలిగా కనిపించనున్నారు. దాదాపు 28 ఏళ్ల తర్వాత నాగార్జున-టబు కాంబినేషన్ తెరపైకి వస్తుండటంతో సినిమాపై ఆసక్తి పెరిగింది. ఐశ్వర్య రాజేష్, సుస్మితా భట్, విజయేంద్ర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. షూటింగ్ కొనసాగుతున్నా చిత్రబృందం ఇప్పటివరకు ఎలాంటి అధికారిక రూపాన్ని విడుదల చేయలేదు. సాధారణంగా అగ్ర హీరోల చిత్రాలకు వరుసగా ప్రచార కంటెంట్ విడుదల చేస్తుండగా, ఈ సినిమాకు మాత్రం గోప్యత పాటిస్తున్నారు. దీంతో నాగార్జున పాత్ర, ఇతర నటీనటుల వివరాలపై అభిమానుల్లో ఉత్కంఠ కొనసాగుతోంది.
నాగార్జున పుట్టినరోజైన ఆగస్టు 29న ఈ ఎదురుచూపులకు తెరపడనున్నట్లు సమాచారం. ఆరోజు సినిమా పేరుతో పాటు ప్రత్యేక గ్లింప్స్, తొలి రూపాన్ని విడుదల చేసేందుకు చిత్రబృందం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు ‘నెక్ట్స్ లెవెల్’ అనే శక్తిమంతమైన పేరును పరిశీలిస్తున్నట్లు పరిశ్రమ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. షూటింగ్ చివరి దశకు చేరుకున్న నేపథ్యంలో ఆ రోజునుంచే ప్రచార కార్యక్రమాలను వేగవంతం చేసే అవకాశముంది. ఇప్పటివరకు దాచిన వివరాలను బయటపెట్టడం ద్వారా సినిమాపై మరింత ఆదరణ పెంచాలని చిత్రబృందం భావిస్తున్నట్లు తెలుస్తోంది. నాగార్జున కెరీర్‌లో 100వ సినిమా కావడంతో ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఆగస్టు 29న విడుదలయ్యే దృశ్యాల్లో ఎలాంటి సర్‌ప్రైజ్ ఉంటుందో ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!