3, నవంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మళ్లీ ఫామ్‌లోకి యశస్వి.. కివీస్‌-ఎ బౌలర్లపై విరుచుకుపడ్డ యువ ఓపెనర్

Writer: Chandrika 12:37 PM, 3 నవంబర్, 2026
మళ్లీ ఫామ్‌లోకి యశస్వి.. కివీస్‌-ఎ బౌలర్లపై విరుచుకుపడ్డ యువ ఓపెనర్

కొంతకాలంగా పేలవ ప్రదర్శనతో విమర్శలు ఎదుర్కొంటున్న భారత యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ తిరిగి ఫామ్‌లోకి వచ్చాడు. న్యూజిలాండ్‌-ఎతో జరిగిన రెండో అనధికారిక టెస్టులో అజేయ సెంచరీతో ఆకట్టుకున్నాడు. 162 బంతుల్లో 155 పరుగులు చేసిన అతడు.. తన ఇన్నింగ్స్‌లో 15 ఫోర్లు, ఐదు సిక్సర్లు బాదాడు. నాలుగో రోజు ఆటను 32 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో ప్రారంభించిన భారత్‌-ఎ.. సాయి సుదర్శన్ (11), దేవదత్ పడిక్కల్ వికెట్లను త్వరగా కోల్పోయి 36/2తో కష్టాల్లో పడింది. ఈ దశలో క్రీజులోకి వచ్చిన జైస్వాల్.. యశ్ రాథోడ్‌తో కలిసి అద్భుతంగా ఆడాడు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 247 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. రాథోడ్ కూడా 100 పరుగులతో అజేయంగా నిలవడంతో భారత్‌-ఎ రెండో ఇన్నింగ్స్‌లో రెండు వికెట్లకు 282 పరుగులు చేసింది.

టీ విరామం తర్వాత వెలుతురు లేమి, ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ఆటను ముందుగానే నిలిపివేశారు. దీంతో భారత్‌-ఎ, న్యూజిలాండ్‌-ఎ మధ్య రెండో అనధికారిక టెస్టు డ్రాగా ముగిసింది. అంతకుముందు న్యూజిలాండ్‌-ఎ తొలి ఇన్నింగ్స్‌లో 424 పరుగులు చేయగా.. భారత్‌-ఎ 346 పరుగులకు ఆలౌటైంది. ప్రస్తుతం భారత్‌-న్యూజిలాండ్ టీ20 సిరీస్ ముగియగా, బుధవారం నుంచి ఐదు వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది. అనంతరం ఇరు జట్లు రెండు టెస్టుల్లో తలపడనున్నాయి. పరిమిత ఓవర్ల జట్టులో చోటు దక్కించుకోని జైస్వాల్.. టెస్టు సిరీస్‌లో కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌తో కలిసి ఓపెనింగ్ చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అతడి అజేయ సెంచరీ భారత జట్టుకు శుభసూచకంగా మారింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
హార్దిక్‌ పాండ్య రీఎంట్రీపై గిల్‌ కీలక అప్‌డేట్‌..

హార్దిక్‌ పాండ్య రీఎంట్రీపై గిల్‌ కీలక అప్‌డేట్‌..

ఐపీఎల్ 2027కు ముందు బిగ్ ట్రేడ్.. పంజాబ్‌కు హార్దిక్, ముంబైకి అర్ష్‌దీప్?

ఐపీఎల్ 2027కు ముందు బిగ్ ట్రేడ్.. పంజాబ్‌కు హార్దిక్, ముంబైకి అర్ష్‌దీప్?

వన్డే సిరీస్‌కు ముందు టీమిండియాకు బౌలింగ్‌ బెంగ..

వన్డే సిరీస్‌కు ముందు టీమిండియాకు బౌలింగ్‌ బెంగ..

ఏసీసీ రైజింగ్ స్టార్స్ ఆసియా కప్‌.. ఇండియా-ఎ కెప్టెన్‌గా తిలక్ వర్మ

ఏసీసీ రైజింగ్ స్టార్స్ ఆసియా కప్‌.. ఇండియా-ఎ కెప్టెన్‌గా తిలక్ వర్మ

యూత్ ఒలింపిక్స్‌లో భారత్‌కు రెండు పతకాలు..

యూత్ ఒలింపిక్స్‌లో భారత్‌కు రెండు పతకాలు..

ఓటముల గురించి ఆలోచించొద్దు.. సిరీస్ విజయాన్ని ఆస్వాదించండి: గంభీర్

ఓటముల గురించి ఆలోచించొద్దు.. సిరీస్ విజయాన్ని ఆస్వాదించండి: గంభీర్

ట్యాగ్లు
యశస్వి జైస్వాల్భారత్-ఎన్యూజిలాండ్-ఎయశ్ రాథోడ్అనధికారిక టెస్ట్భారత్ న్యూజిలాండ్ టెస్ట్ సిరీస్భారత క్రికెట్జైస్వాల్ సెంచరీశుభ్‌మన్ గిల్క్రికెట్ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మోదీపై రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు..
జనరల్

మోదీపై రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు..

విమాన టికెట్ల ధరలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు.. ప్రయాణికులకు షాక్!
జనరల్

విమాన టికెట్ల ధరలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు.. ప్రయాణికులకు షాక్!

వాట్సాప్‌లో రూ.8,000 దీపావళి బోనస్ మెసేజ్.. నమ్మితే బ్యాంక్ ఖాతా ఖాళీ!
జనరల్

వాట్సాప్‌లో రూ.8,000 దీపావళి బోనస్ మెసేజ్.. నమ్మితే బ్యాంక్ ఖాతా ఖాళీ!

హార్దిక్‌ పాండ్య రీఎంట్రీపై గిల్‌ కీలక అప్‌డేట్‌..
క్రీడలు

హార్దిక్‌ పాండ్య రీఎంట్రీపై గిల్‌ కీలక అప్‌డేట్‌..

ఐపీఎల్ 2027కు ముందు బిగ్ ట్రేడ్.. పంజాబ్‌కు హార్దిక్, ముంబైకి అర్ష్‌దీప్?
క్రీడలు

ఐపీఎల్ 2027కు ముందు బిగ్ ట్రేడ్.. పంజాబ్‌కు హార్దిక్, ముంబైకి అర్ష్‌దీప్?

బాపట్ల తీరాన్ని వణికిస్తున్న ‘మురసు’ తుపాను..
జనరల్

బాపట్ల తీరాన్ని వణికిస్తున్న ‘మురసు’ తుపాను..

బిగ్‌బాస్‌లో ఫ్రెండ్స్ వార్.. నామినేషన్లతో బయటపడ్డ స్నేహితుల మధ్య విభేదాలు!
షోస్

బిగ్‌బాస్‌లో ఫ్రెండ్స్ వార్.. నామినేషన్లతో బయటపడ్డ స్నేహితుల మధ్య విభేదాలు!

బిగ్‌బాస్ ఇంట్లో వంశీ వ్యాఖ్యలతో రచ్చ.. ముకేష్ ఫైర్, నామినేషన్లలో వాడీవేడి వాదనలు
షోస్

బిగ్‌బాస్ ఇంట్లో వంశీ వ్యాఖ్యలతో రచ్చ.. ముకేష్ ఫైర్, నామినేషన్లలో వాడీవేడి వాదనలు

స్టాక్‌ మార్కెట్‌లో బీఎల్‌ఎస్‌ పాలిమర్స్‌ బంపర్‌ ఎంట్రీ..
బిజినెస్

స్టాక్‌ మార్కెట్‌లో బీఎల్‌ఎస్‌ పాలిమర్స్‌ బంపర్‌ ఎంట్రీ..

‘రామాయణ’ సిరీస్‌లో రెండు సినిమాలేనా?
సినిమాలు

‘రామాయణ’ సిరీస్‌లో రెండు సినిమాలేనా?

తిరుపతి జిల్లాలో మున్సిపల్ కౌంటింగ్ కేంద్రాల తనిఖీ.. ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్
జనరల్

తిరుపతి జిల్లాలో మున్సిపల్ కౌంటింగ్ కేంద్రాల తనిఖీ.. ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్

ఢిల్లీ నిరసనలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
జనరల్

ఢిల్లీ నిరసనలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!