

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ తన క్రేజీ ప్రాజెక్ట్ ‘దాదా’ షూటింగ్‌ను తిరిగి ప్రారంభించారు. ఇటీవల చిన్న గాయం కారణంగా కొంత విరామం తీసుకున్న బాలయ్య మళ్లీ సెట్స్‌లోకి అడుగుపెట్టడంతో చిత్రబృందంలో కొత్త ఉత్సాహం నెలకొంది. ‘బ్యాక్ టు సెట్స్.. బ్యాక్ టు ది ఎనర్జీ.. బ్యాక్ టు ది మ్యాడ్‌నెస్’ అంటూ మేకర్స్ సోషల్ మీడియా ద్వారా బాలకృష్ణ తిరిగి యాక్షన్ మోడ్‌లోకి వచ్చిన విషయాన్ని ప్రకటించారు.
గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో బాలకృష్ణ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తుండగా, మంచు మనోజ్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని వృద్ధి సినిమాస్, జీ స్టూడియోస్ సౌత్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. డిసెంబర్ 24న క్రిస్మస్ కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. బాలయ్య రీఎంట్రీతో ఈ సినిమాపై మాస్ ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరుగుతోంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!