

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎన్నో సంవత్సరాలుగా సూపర్ హిట్ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూ మెగాస్టార్‌గా గుర్తింపు పొందిన హీరో చిరంజీవి. ఆయన సినిమా వస్తుందంటే ఇప్పటికీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ప్రస్తుతం చిరంజీవి దర్శకుడు బాబీ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు. ఈ సినిమా పూర్తయ్యాక దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో మరో ప్రాజెక్ట్ చేయడానికి సిద్ధమవుతున్నారని సమాచారం.
శ్రీకాంత్ ఓదెల ప్రస్తుతం ప్యారడైజ్ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా ఆగస్టు 21 న విడుదల కావడానికి సిద్ధమవుతోంది. ఆ సినిమా పూర్తయ్యాక చిరంజీవితో చేసే కొత్త ప్రాజెక్ట్ పనులను ప్రారంభించనున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు కూడా వార్తలు వినిపిస్తున్నాయి.
ఇక ఈ సినిమాలో రెండు కీలక విలన్ పాత్రలు ఉన్నాయని టాలీవుడ్లో చర్చ జరుగుతోంది. ఆ పాత్రల కోసం మోహన్ బాబు మరియు రాజశేఖర్‌లను తీసుకోవాలని దర్శకుడు శ్రీకాంత్ ఓదెల భావిస్తున్నారని సమాచారం. ఈ విషయాన్ని ఇప్పటికే చిరంజీవితో కూడా చర్చించారని, ఆయన కూడా అంగీకరించినట్టు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ప్యారడైజ్ సినిమాలో మోహన్ బాబు విలన్‌గా నటిస్తున్నందున దర్శకుడికి ఆయనతో మంచి పరిచయం ఏర్పడింది. అలాగే రాజశేఖర్ ఇమేజ్‌కు సరిపోయేలా ఒక బలమైన పాత్రను కూడా సిద్ధం చేసినట్టు తెలుస్తోంది.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!