

మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా, శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కొత్త సినిమా ఇరుముడి ఇప్పటికే మంచి ఆసక్తిని కలిగిస్తోంది. ఈ సినిమాలో ప్రధాన హీరోయిన్గా ప్రియా భవానీ శంకర్ నటిస్తోంది. తాజాగా ఈ చిత్రంలో మరో హీరోయిన్ కూడా ఉండబోతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. కథలో ప్రత్యేకంగా రూపొందించిన ఒక ముఖ్యమైన పాత్ర కోసం తమన్నాను ఎంపిక చేసినట్లు సమాచారం. కమర్షియల్ అంశాలను దృష్టిలో పెట్టుకుని దర్శకుడు ఈ పాత్రను రూపొందించినట్లు తెలుస్తోంది.
ఈ సినిమా గురించి గతంలో రవితేజ మాట్లాడుతూ, “కొన్ని కథలు జీవితంలో సరైన సమయంలో మనల్ని ఎంచుకుంటాయి. అలాంటి కథే ఈ ‘ఇరుముడి’. ఈ సినిమాలో భాగం కావడం నాకు అదృష్టంగా అనిపిస్తోంది. ఈ కొత్త ప్రయాణంపై చాలా ఉత్సాహంగా ఉన్నాను” అని చెప్పారు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది.
ఈ సినిమాలో సంగీతాన్ని జి. వి. ప్రకాష్ అందిస్తున్నారు. అలాగే చిన్నారి నటిగా బేబీ నక్షత్ర రవితేజ కుమార్తె పాత్రలో కనిపించనుంది. కథ, నటీనటులు, స్పెషల్ పాత్రలతో ఈ సినిమా ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది.



.jpg&w=3840&q=75)



.jpg&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!