

మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో ప్రశాంత్ నీల్ సమర్పిస్తున్న హారర్ థ్రిల్లర్ ‘418 ది మూవీ’. డెబ్యూ దర్శకుడు కీర్తన్ నాగగౌడ రచించి, దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సూర్య రాజ్, చరణ్ లక్కరాజు, చైత్ర జే ఆచార్, ప్రీతి పడగల కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తొలుత జులైలో ఈ సినిమాను విడుదల చేయాలని మేకర్స్ భావించారు. అయితే కొన్ని కారణాలతో వాయిదా వేసి సెప్టెంబర్ 18న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్ణయించారు. తాజాగా ఈ సినిమా మరోసారి వాయిదా పడే అవకాశం ఉందంటూ టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
హిందీ వెర్షన్‌ను కూడా ఏకకాలంలో విడుదల చేయాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నారని, అందుకే రిలీజ్ వాయిదా పడే అవకాశం ఉందని సమాచారం. హిందీ వెర్షన్ డిస్ట్రిబ్యూషన్ కోసం అనిల్ తడాని ముందుకొచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ‘418 ది మూవీ’ని అక్టోబర్ 23న విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. గతంలో సెన్సార్ సంబంధిత సమస్యల కారణంగా సినిమా విడుదల ఆలస్యమైంది. అయితే తాజా వాయిదా వెనుక హిందీ వెర్షన్‌ను భారీగా విడుదల చేయాలనే వ్యూహం ఉన్నట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. అయితే కొత్త విడుదల తేదీపై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!