

యూట్యూబ్ వీడియోల వ్యూస్ లెక్కింపు విధానంలో కీలక మార్పు చేయనుంది. ఆగస్టు 24 నుంచి అన్ని వీడియో ఫార్మాట్లకు ఒకే విధమైన వ్యూ కౌంటింగ్ విధానాన్ని అమలు చేయనున్నట్లు ప్రకటించింది. లాంగ్ ఫార్మాట్ వీడియోలతో పాటు యూట్యూబ్ షార్ట్స్‌కు కూడా ఈ కొత్త విధానం వర్తించనుంది. వీడియో ప్లే అయిన వెంటనే, అంటే తొలి ఫ్రేమ్ కనిపించిన క్షణం నుంచే ఒక వ్యూగా పరిగణించనుంది. వ్యూ నమోదు కావడానికి కనీస వాచ్‌టైమ్ అవసరం ఉండదు.
ఈ మార్పు వల్ల వీడియోల వ్యూస్ వేగంగా పెరిగే అవకాశం ఉందని యూట్యూబ్ తెలిపింది. అన్ని వీడియో ఫార్మాట్లలో క్రియేటర్లకు లభించే ఎక్స్‌పోజర్‌ను ఒకే ప్రమాణంతో చూపించడం ద్వారా బ్రాండ్ డీల్స్‌లో వారి విలువను మరింత స్పష్టంగా అంచనా వేయడమే ఈ నిర్ణయం ఉద్దేశమని పేర్కొంది. కొత్త విధానం క్రియేటర్లకు తమ కంటెంట్ రీచ్‌ను మెరుగ్గా అర్థం చేసుకోవడంలో సహాయపడుతుందని యూట్యూబ్ భావిస్తోంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!