

మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై భారత కోస్ట్‌గార్డ్, గుజరాత్ ఉగ్రవాద నిరోధక దళం (ATS) సంయుక్తంగా భారీ ఆపరేషన్ నిర్వహించాయి. సెప్టెంబర్ 25న లక్షద్వీప్‌కు పశ్చిమాన అరేబియా సముద్రంలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఇరాన్‌కు చెందిన పడవను అధికారులు గుర్తించారు. సముద్ర, వైమానిక నిఘాతో పడవను ట్రాక్ చేసిన అనంతరం ఛేజ్ చేసి అడ్డుకుని తనిఖీలు చేపట్టారు.
పడవలో 526 కిలోల హెరాయిన్, మెథాంఫెటమైన్ ఉన్నట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో వీటి విలువ రూ.3,000 కోట్లకు పైగా ఉంటుందని అధికారులు తెలిపారు. పడవలో ఉన్న ఐదుగురు పాకిస్థానీ పౌరులను అదుపులోకి తీసుకున్నారు. పడవ, సిబ్బంది, స్వాధీనం చేసుకున్న మాదక ద్రవ్యాలను సాయుధ భద్రత మధ్య ముంబయికి తరలించి, సంయుక్త విచారణతో పాటు తదుపరి చట్టపరమైన చర్యలు చేపడుతున్నారు. ఈ అక్రమ రవాణా వెనుక అంతర్జాతీయ డ్రగ్స్ ముఠాల సంబంధాలపై దర్యాప్తు కొనసాగుతోంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!