

ఢిల్లీలో ట్రాఫిక్ నిర్వహణను మరింత సమర్థవంతంగా మార్చేందుకు కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. రూ.1,789.52 కోట్ల అంచనా వ్యయంతో ఇంటెలిజెంట్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (ఐటీఎంఎస్) అమలుకు ఆమోదం తెలిపింది. ఢిల్లీలోని 42 ప్రధాన ట్రాఫిక్ కారిడార్లను మూడు దశల్లో 24 నెలల్లో ఈ వ్యవస్థ పరిధిలోకి తీసుకురానున్నారు. ఏఐ ఆధారిత అడాప్టివ్ ట్రాఫిక్ సిగ్నల్స్, రియల్‌టైమ్ ట్రాఫిక్ సమాచారం, ఆటోమేటెడ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వంటి సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి.
అంబులెన్సులు, ఇతర అత్యవసర వాహనాల కోసం గ్రీన్ కారిడార్ సౌకర్యాన్ని కూడా ఈ వ్యవస్థలో ఏర్పాటు చేయనున్నారు. ట్రాఫిక్ జామ్‌లు, ప్రమాదాలను రియల్‌టైమ్‌లో గుర్తించి వేగంగా స్పందించేలా ఐటీఎంఎస్ ను రూపొందించనున్నారు. రాంగ్ రూట్‌లో ప్రయాణించడం, అతివేగం, రెడ్‌లైట్ జంపింగ్, హెల్మెట్, సీట్‌బెల్ట్ ఉల్లంఘనలను సాంకేతిక పరిజ్ఞానం ద్వారా గుర్తించి ఆటోమేటెడ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ చేపట్టనున్నారు.




కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!