
జనరల్

2027-28 మార్కెటింగ్ సీజన్‌కు సంబంధించి ఆరు రబీ పంటల కనీస మద్దతు ధరలను (ఎంఎస్‌పీ) పెంచుతూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. కుసుమ పంటకు అత్యధికంగా క్వింటాల్‌కు రూ.675, ఆవాలు-రాప్‌సీడ్‌కు రూ.413 చొప్పున పెంపు ప్రకటించింది. మసూర్ పప్పుకు రూ.390, బార్లీకి రూ.136, శనగకు రూ.83, గోధుమకు రూ.25 చొప్పున ఎంఎస్‌పీ పెంచింది.
తాజా పెంపుతో గోధుమ ఎంఎస్‌పీ క్వింటాల్‌కు రూ.2,610కి, శనగ రూ.5,958కి, మసూర్ రూ.7,390కి, ఆవాలు-రాప్‌సీడ్ రూ.6,613కి, కుసుమ రూ.7,215కి, బార్లీ రూ.2,286కి చేరింది. రైతులకు గిట్టుబాటు ధర కల్పించడం, పంటల వైవిధ్యాన్ని ప్రోత్సహించడం ఈ నిర్ణయం లక్ష్యమని కేంద్రం వెల్లడించింది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!