4, అక్టోబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

యమధర్మరాజు ప్రతిష్ఠించిన సూర్యుడు.. కాశీలో యమాదిత్యుని విశిష్టత ఇదే!

Writer: Nithish 05:28 AM, 4 అక్టోబర్, 2026
యమధర్మరాజు ప్రతిష్ఠించిన సూర్యుడు.. కాశీలో యమాదిత్యుని విశిష్టత ఇదే!

ప్రత్యక్ష దైవంగా భావించే సూర్యభగవానుడిని ఆరాధిస్తే ఆరోగ్యం, ఐశ్వర్యం, జ్ఞానం, విజయాలు లభిస్తాయని శాస్త్రవచనం. అందుకే దేశవ్యాప్తంగా సూర్యనారాయణుడికి అంకితమైన అనేక ఆలయాలు ఉన్నాయి. వాటిలో కాశీలోని ద్వాదశ ఆదిత్య క్షేత్రాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. ముక్తి క్షేత్రంగా ప్రసిద్ధి చెందిన వారణాసిలోని ఈ ఆదిత్య ఆలయాల్లో యమాదిత్యుని ఆలయం కూడా ఒకటి. ‘ఆరోగ్యం భాస్కరాదిచ్ఛేత్’ అనే శాస్త్రవచనం ప్రకారం ఆరోగ్య ప్రదాత అయిన సూర్యభగవానుడిని భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తారు. కవిసార్వభౌమ శ్రీనాథుడు రచించిన ‘కాశీ ఖండం’లోనూ యమాదిత్యుని క్షేత్ర విశేషాలు ప్రస్తావించబడ్డాయి.

కాశీలోని సింధియా ఘాట్ సమీపంలోని సంకట దేవి ఆలయానికి చేరువలో యమాదిత్యుడు కొలువై ఉన్నట్లు స్థలపురాణం చెబుతోంది. సూర్యభగవానుడి కుమారుడైన యమధర్మరాజు తన భటుల తప్పిదానికి ప్రాయశ్చిత్తంగా కాశీలో సూర్యమూర్తిని ప్రతిష్ఠించి ఆరాధించాడని విశ్వాసం. యముడు ప్రతిష్ఠించిన ఆదిత్యుడు కావడంతో ఆయనను ‘యమాదిత్యుడు’గా పూజిస్తారు. అలాగే యమధర్మరాజు ప్రతిష్ఠించిన శివలింగం ‘యమేశ్వర స్వామి’గా ప్రసిద్ధి చెందింది. యమేశ్వర స్వామి, యమాదిత్యుని దర్శిస్తే మోక్షం, శాశ్వత స్వర్గప్రాప్తి కలుగుతాయని భక్తుల విశ్వాసం. ముఖ్యంగా మంగళవారం, చతుర్దశి ఒకే రోజున వచ్చినప్పుడు గంగాస్నానం చేసి యమాదిత్యుని దర్శిస్తే అనారోగ్య సమస్యలు, అపమృత్యు భయాలు తొలగి పాపాలు నశిస్తాయని నమ్మకం.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌ రాజీనామా కోరుతూ జంతర్‌మంతర్‌ వద్ద ఆందోళన

తెలుగుదనం, మాతృభాషను కాపాడుకోవాలి - వెంకయ్య నాయుడు

జ్ఞానేశ్‌కుమార్‌ వెంటనే రాజీనామా చేయాలి.. షర్మిల డిమాండ్‌

విద్యార్థులకు పరిశోధన ఆధారిత విద్య అందించాలి - శ్రీధర్‌బాబు

అమరావతిలో శాశ్వత పాన్‌ ఐఐటీ కౌన్సిల్‌.. చంద్రబాబు కీలక ప్రకటన
ట్యాగ్లు
కాశీవారణాసియమాదిత్యుడుద్వాదశ ఆదిత్యులుసూర్యభగవానుడుయమధర్మరాజుయమేశ్వర స్వామికాశీ ఖండంహిందూ ఆధ్యాత్మికంఆలయ విశేషాలుకాశీ యాత్రగంగాస్నానం
Advertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

అమరావతిలో శాశ్వత పాన్‌ ఐఐటీ కౌన్సిల్‌.. చంద్రబాబు కీలక ప్రకటన

సైబర్ నేరాల నుంచి పిల్లలకు రక్షణ.. సమగ్ర ప్రణాళిక రూపొందించాలి - రేవంత్

సైబర్ నేరాల నుంచి పిల్లలకు రక్షణ.. సమగ్ర ప్రణాళిక రూపొందించాలి - రేవంత్

Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌ రాజీనామా కోరుతూ జంతర్‌మంతర్‌ వద్ద ఆందోళన
జనరల్

కొత్త కార్లకు బదులు ప్రీ-ఓన్డ్‌ లగ్జరీ కార్ల వైపు యువత మొగ్గు
బిజినెస్

కొత్త కార్లకు బదులు ప్రీ-ఓన్డ్‌ లగ్జరీ కార్ల వైపు యువత మొగ్గు

కాంగ్రెస్‌ సీఎంలు రాజీనామా చేసి బ్యాలెట్‌ ఎన్నికలకు రావాలి - బండి సంజయ్‌
రాజకీయాలు

కాంగ్రెస్‌ సీఎంలు రాజీనామా చేసి బ్యాలెట్‌ ఎన్నికలకు రావాలి - బండి సంజయ్‌

తెలుగుదనం, మాతృభాషను కాపాడుకోవాలి - వెంకయ్య నాయుడు
జనరల్

తెలుగుదనం, మాతృభాషను కాపాడుకోవాలి - వెంకయ్య నాయుడు

జ్ఞానేశ్‌కుమార్‌ వెంటనే రాజీనామా చేయాలి.. షర్మిల డిమాండ్‌
జనరల్

జ్ఞానేశ్‌కుమార్‌ వెంటనే రాజీనామా చేయాలి.. షర్మిల డిమాండ్‌

విద్యార్థులకు పరిశోధన ఆధారిత విద్య అందించాలి - శ్రీధర్‌బాబు
జనరల్

విద్యార్థులకు పరిశోధన ఆధారిత విద్య అందించాలి - శ్రీధర్‌బాబు

గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీ ఎంపికలో బీసీలకు ప్రాధాన్యం - మహేశ్‌కుమార్‌గౌడ్‌
రాజకీయాలు

గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీ ఎంపికలో బీసీలకు ప్రాధాన్యం - మహేశ్‌కుమార్‌గౌడ్‌

లోక్‌సభ, అసెంబ్లీలను రద్దు చేసి బ్యాలెట్‌తో ఎన్నికలు నిర్వహించాలి - ఖర్గే
రాజకీయాలు

లోక్‌సభ, అసెంబ్లీలను రద్దు చేసి బ్యాలెట్‌తో ఎన్నికలు నిర్వహించాలి - ఖర్గే

అమరావతిలో శాశ్వత పాన్‌ ఐఐటీ కౌన్సిల్‌.. చంద్రబాబు కీలక ప్రకటన
జనరల్

అమరావతిలో శాశ్వత పాన్‌ ఐఐటీ కౌన్సిల్‌.. చంద్రబాబు కీలక ప్రకటన

సైబర్ నేరాల నుంచి పిల్లలకు రక్షణ.. సమగ్ర ప్రణాళిక రూపొందించాలి - రేవంత్
జనరల్

సైబర్ నేరాల నుంచి పిల్లలకు రక్షణ.. సమగ్ర ప్రణాళిక రూపొందించాలి - రేవంత్

పాన్‌ ఐఐటీ సమిట్‌లో వినూత్న ఆవిష్కరణలు.. స్టార్టప్‌లకు చంద్రబాబు భరోసా

ఏపీ బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన ప్రభుత్వం